7 July, 2026 | 2:10 AM

సంజూ ఔట్.. ప్రభ్ సిమ్రన్, రింకూ ఇన్

07-07-2026 12:00 AM
  1. జింబాబ్వే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన
  2. ఇంగ్లాండ్‌తో వన్డేలకు నితీశ్ రెడ్డి దూరం

ముంబై, జూలై 6 : జింబాబ్వేతో జరగనున్న మూడు టీ20ల సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. ఈ సిరీస్‌కు పలువురు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. ఓ పెనర్ సంజూ శాంసన్‌ను తప్పించారు.  వైభవ్‌ను కొనసాగించిన సెలక్టర్లువికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌తో పాటు బ్యాకప్‌గా ప్రభ్ సిమ్రన్ సింగ్‌ను ఎంపిక చేశారు. అలాగే ఫినిషర్ రింకూ సింగ్‌కు కూడా సెలక్టర్లు పిలుపు నిచ్చారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆడుతున్న అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లకు రెస్ట్ ఇచ్చారు. 

యువ ఆటగాళ్లు యశ్ ఠాకూ ర్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మలకు చో టు దక్కింది. మరోవైపు ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్‌కు జట్టులో మార్పు చోటు చేసుకుంది. గాయంతో బాధపడుతున్న నితీష్ కుమార్ రెడ్డి వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఆల్‌రౌండర్ శివమ్ దూబేను సెలక్టర్లు ఎంపిక చేశారు. దాదాపు రెండేళ్ల తర్వాత దూబే వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. కాగా జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్ జూలై 23 నుంచి మొదలుకానుంది.

జింబాబ్వేతో టీ20లకు భారత జట్టు

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్.

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత జట్టు

గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్, బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్షదీప్, గుర్నూర్ బ్రార్, శివమ్ దూబే.