ముగిసిన శంకర జయంతుత్సవాలు
14-05-2024 02:02 AM
రాజన్న సిరిసిల్ల, మే13 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో గత 5 రోజులుగా కొనసాగుతున్న శంకర జయంత్యుత్సవాలు సోమవారం ముగిశాయి. ఆలయంలో స్వా మివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రు ద్రాభిషేకం, పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు చేశారు. అద్దాల మండపంలో ఆది శం కరాచార్యుల చిత్రపటానికి పూజలు చేశారు. సాయంత్రం శంకరాచార్యుల ప్రవచనాలు గావించారు. భక్తులు ఆలయంలో స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు.




