8 June, 2026 | 7:58 PM

Breaking News

మహర్రం సందర్భంగా భద్రత కల్పించాలని విజ్ఞప్తి   •   పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •  

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

07-04-2026 10:47 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని(World Health Day) పురస్కరించుకుని మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుబోధ్ ఆధ్వర్యంలో “ఆరోగ్యం కోసం అందరం కలిసి కట్టుగా నిలబడదాం” అనే నినాదంతో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రారంభమై పట్టణ ప్రధాన వీధి గుండా అంబేద్కర్ చౌక్ వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ పౌష్టికాహారం, పరిశుభ్రత, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతను డాక్టర్ సుబోధ్ వివరించారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సమతుల ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పరిశుభ్రత పాటించడం అవసరమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సత్యం, హెల్త్ ఎడ్యుకేటర్లు రషీద్, లలిత, ల్యాబ్ టెక్నీషియన్ సమ్రీన్, మెడికల్ కళాశాల సిబ్బంది, జూనియర్ డాక్టర్లు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.