పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
14-05-2024 02:02 AM
అందోల్, మే 13 : అందోల్ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ విధానాన్ని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి పరిశీలించారు. సోమవారం అందోల్ నియోజకవర్గంలోని చౌటకూర్ మం డలంలోని శివంపేట గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని ఆమె పరిశీలించి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందోల్ ని యోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతం గా కొనసాగిందని తెలిపారు.




