ఓటు వేసేందుకు వృద్ధుల తంటాలు
14-05-2024 02:04 AM
అలంకార ప్రాయంగా ర్యాంపులు
భద్రాద్రి కొత్తగూడెం, మే 13 (విజయక్రాంతి): అధికారుల నిర్లక్ష్యంతో పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడ్డారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ర్యాంపులు అలంకార ప్రాయంగా మారడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలోని ప్రాథమిక పాఠశాలలో ఓటు వేసేందుకు వృద్ధులు పడరాని పాట్లు పడ్డారు. పోలింగ్ కేంద్రంలో రెండు ర్యాంపులు ఉండగా, ఒకటి సరైన లెవల్ లేక వీల్‌చైర్ ఎక్కే పరిస్థితి లేదు. మరొకటి ఉన్నా గోడ అడ్డం ఉండటంతో నిరుపయోగంగా మారింది. సోమవారం పాత పాల్వంచలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వచ్చిన 80 సంవత్సరాల పద్మావతి అనే వృద్ధురాలు నానా తంటాలు పడ్డారు.




