నగరంలో పల్లె సొగసులు!

05-10-2026 | 05:20am
  1. చేనేత నుంచి చిరుధాన్యాల దాకా..
  2. హైదరాబాద్‌లో 7నుంచి ‘సారస్ మేళా’
  3. మంత్రి సీతక్క  

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాం తి): పోచంపల్లి, గద్వాల, నారాయణపేట చే నేతల అందం..  గ్రామీణ మహిళల (rural women)చేతు ల్లో రూపుదిద్దుకున్న హస్తకళలు, పచ్చళ్లు, పిండి వంటలు, మిల్లెట్ ఉత్పత్తులు.. దేశంలోని వివిధ ప్రాంతాల ప్రత్యేకతలు ఒకే వేదికపై క నిపించనున్నాయి. గ్రామీణ మహిళలు, కళాకారులు, స్వయం సహాయక సంఘాల ఉత్ప త్తులకు పట్టణ మార్కెట్ కల్పించేందుకు హైదరాబాద్ వేదిక కానుంది.

ఐమాక్స్ థియేటర్ పక్కన హెచ్‌ఎండీఏ మైదానంలో ఈనె ల 7 నుంచి 18వ తేదీ వరకు ‘సారస్ మేళా’ (Saras Mela)నిర్వహించనున్నారు. ఈ మేళాలో తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్త లు, స్వయం సహాయక సంఘాలు, కళాకారుల ఆధ్వర్యంలో వందల స్టాళ్లు ఏర్పాటు చేసి తాము తయాచుచేసిన ఉత్పత్తులను విక్రయించనున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో తయారయ్యే ఉత్పత్తులకు మార్కెట్‌ను కల్పించడం సారస్ మేళా ప్రత్యేకత. తయారీదారులు నేరుగా వినియోగదారులను కలుసుకోవడం ద్వారా తమ ఉత్పత్తులకు ఆదరణను అంచనా వేసుకోవడంతో పాటు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నాణ్య త, ప్యాకేజింగ్, ఉత్పత్తుల్లో మార్పులు చేసుకునే అవకాశం పొందుతారు. 

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి దోహదం

మహిళలు ఉత్పత్తిదారులుగా మాత్రమే కాకుండా మార్కెట్ అవసరాలను అర్థం చేసుకుని వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునే పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి సారస్ మేళా దోహదపడనుంది.  ఆడబిడ్డల చేతిలో ఉన్న నైపుణ్యానికి మార్కెట్‌ను జోడి స్తే అదే వారి ఆర్థిక స్వావలంబనకు బలమైన పునాది కానుంది. వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొనే మహిళా పారిశ్రామికవేత్తలు, కళాకారుల ఉత్పత్తులు ఒకే చోట అందుబాటు లోకి రావడం ఈ మేళా మరో ప్రత్యేకత. 

‘సారస్’కు రావాలి.. 

సారస్ మేళా ద్వారా గ్రామీణ మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు నేరుగా వినియోగదారుల ఆదరణ లభిస్తుందని, అది వారి వ్యాపార ప్రోత్సాహానికి దోహదపడుతుందని మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్ ప్రజలు కుటుంబ సమేతంగా ‘సారస్ మేళా’ను సందర్శించాలని, మన ఆడబిడ్డలు ఎంతో శ్రమించి తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని కోరారు. 

మరిన్ని వార్తలు