15 June, 2026 | 3:19 PM

Breaking News

శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి సేవా కమిటీ ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం   •   తాగునీటి కోసం కేసీఆర్ నగర్ మహిళల ఆందోళన.. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయింపు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ   •   మెట్రో నిధులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్   •   తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •  

సరస్వతి నాట్యమండలి చైర్మన్ బుడితి కోటేశ్వర్ రావుకు బెస్ట్‌షార్ట్ ఫిలిం అవార్డు

23-02-2026 12:51 AM

ఘట్ కేసర్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): గ్లోబల్ ఇండి ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా అసోసియేషన్ దాశరథి థియేటర్ వారు నిర్వహించిన షార్ట్ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా జాతీయ స్థాయిలో బెస్ట్ షార్ట్ ఫిలిం అవార్డును ఘట్ కేసర్ సరస్వతి నాట్యమండలి చైర్మన్ బుడితి కోటేశ్వర్ రావు పలువురు సినిమా డైరెక్టర్ల చేతుల మీదు అందుకున్నారు.

ఘట్ కేసర్ పట్టణానికి చెందిన బుడితి కోటేశ్వర్ రావు సరస్వతీ నాట్య మండి స్థాపించి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రజలను చైతన్యం చేసే విధంగా లఘు చిత్రాలను రచయితగా, డైరెక్టర్, నటుడిగా ఓటుకు నోటు, నీదేం కులంరా లఘు చిత్రాలు జాతీయ స్థాయి ఉత్తమ లఘు చిత్రాలుగా ఎంపిక కావడంతో ఈ మేరకు బెస్ట్ షార్ట్ ఫిలీం అవార్డును నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రముఖ సినిమా డైరెక్టర్లు రేలంగి నరసింహా రావు, చంద్రమోహన్, వి.ఎన్. ఆదిత్య, వన్యమ్ రెడ్డి రాజా, ఎం.వి. రఘు, శ్రీనివాస్, యాంకర్ ఎస్.వి. స్వామినాయుడు, ఎస్. వినయ్ కుమార్ ల చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

ఈ మేరకు ఆవార్డు ఫంక్షన్ లో దళిత సాహిత్య చేత మాస్టర్ జి. శ్రీవిద్య ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ దాసారపు శ్రీనివాస్, జీవనది ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఇంటి లక్ష్మీలు కోటేశ్వర్ రావును అభినందించారు.  ఈ అవార్డు అందించిన సంస్థలకు, పెద్దలకు, డైరెక్టర్లకు అందరికి ధన్యవాదాలు తెలిపారు.