calender_icon.png 23 February, 2026 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్చకు రమ్మంటే దాడికి వచ్చారు

23-02-2026 12:53:07 AM

ఎమ్మెల్యేకు ప్రాణహాని ఉంది 

మద్దతు తెలిపేందుకు వచ్చిన నాయకులను అడ్డుకున్నారు 

ఎమ్మెల్యే రమణారెడ్డి జోలికి వస్తే సహించేది లేదు

బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు 

కామారెడ్డి, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల వ్యవహారంపై చర్చకు రావాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పిలుపు ఇస్తే షబ్బీర్ అలీ రాకుండా కాంగ్రెస్ నాయకులను రెచ్చగొట్టి పంపించడంతో దాడికి వచ్చారని బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

సామరస్య పూర్వకంగా ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో ఎమ్మెల్యే రమణారెడ్డి వస్తానని చెప్పిన పోలీసులు గృహ నిర్బంధం చేసి అరెస్టు చేయడంతో రాలేకపోయారని దీంతో కాంగ్రెస్ నాయకులు రెచ్చగొట్టి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి దాడికి పాల్పడే యత్నం చేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహేందర్ రెడ్డి కారులో వచ్చి ఎమ్మెల్యే పై దాడి చేయాలని రాగా బిజెపి కార్యకర్తలు అడ్డుకున్నారని అన్నారు. ఎమ్మెల్యే ప్రాణ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే పై దాడిని సహించేది లేదని అన్నారు. ఎమ్మెల్యే పై దాడికి యత్నించిన కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు చేయాలని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆరోపణ చేసిన వ్యక్తి రావాలని ఎమ్మెల్యే రమణారెడ్డి పేర్కొంటే ఆయన రాకుండా తన అనుచరులను పంపించి డ్రామాలు చేశారన్నారు. ఎమ్మెల్యే రమణారెడ్డికి ప్రాణ అని ఉందని వారికి తగు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై శనివారం జరిగిన దాడి తర్వాత రమణారెడ్డికి మద్దతుగా కామారెడ్డికి బయలుదేరిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావును మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి లను బిజెపి సీనియర్ నాయకులను అడ్డుకొని మార్గ మధ్యంలోని అరెస్టు చేసి కామారెడ్డికి రానీయకుండా అడ్డుకోవడం జరిగిందన్నారు. ఎన్ని అరెస్టులు చేసినా నీతిగా ఉన్న ఎమ్మెల్యే రమణారెడ్డి గారి జోలికి వస్తే ఊరుకునేది లేదని ఆయన వెంట బిజెపి పార్టీ మొత్తం ఉందని అన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.