7 April, 2026 | 10:28 AM

సమంత చేతుల మీదుగా వరలక్ష్మి ఫస్ట్‌లుక్ — సరస్వతి సినిమా అదరగొడుతోంది!

16-02-2026 12:09 AM

విభిన్న పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్‌కుమార్‌తో కలిసి దోస డైరీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం ‘సరస్వతి’. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. జీవా, ప్రకాశ్‌రాజ్, నాజర్, ప్రియమణి, రాధిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన చిత్రబృందం త్వరలో ప్రమోషన్స్‌ను ప్రారంభించనుంది. ఇందు లో భాగంగా ఈ చిత్ర కథానాయకి వరలక్ష్మి ఫస్ట్‌లుక్‌ను శనివారం హీరోయిన్ సమంతతో లాంచ్ చేయించారు. ఈ తాజా పోస్టర్‌లో వరలక్ష్మి శరత్‌కుమార్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా, ఏఎం ఎడ్విన్ సినిమాటోగ్రాఫర్‌గా, వెంకట్ ఎడిటర్‌గా, సుధీర్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.