27 June, 2026 | 7:06 PM

Breaking News

జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •  

మ్యానిఫెస్టో అమలుకు అంకితమైన సర్పంచ్ అభ్యర్థులు

04-04-2026 12:07 AM

అశ్వాపురం, ఏప్రిల్ 3, (విజయక్రాంతి): మొండికుంట, మల్లెలమడుగు గ్రామపంచాయతీలకు సర్పంచ్లుగా ఎన్నికైన తరువాత ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో హామీల అమలుపై గ్రామ ప్రజల్లో చర్చ నెలకొంది. ఎన్నికల సమయంలో ప్రకటించిన అభివృద్ధి పనుల్లో ముఖ్యంగా కోతుల బెడద నివారణ, తాగునీరు, వీధి దీపాలు, సీసీ రోడ్లు, పారిశుద్ధ్యం, పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం వంటి అంశాలు ఎంతవరకు ప్రారంభమయ్యాయనే విషయంపై గ్రామస్తులు స్పష్టత కోరుతున్నారు.

ప్రత్యేకంగా ఈ రెండు గ్రామపంచాయతీల్లో కోతుల బెడద రోజురోజుకు తీవ్రమవుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, పండ్ల తోటలు, చిన్నపిల్లలపై కూడా కోతులు దాడి చేసే పరిస్థితి నెలకొనడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎన్నికల సమయంలో కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో, ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి స్పష్టమైన చర్యలు కనిపించకపోవడం గ్రామ ప్రజల్లో అసంతృప్తిని పెరుగుతోంది. ఇప్పటివరకు కొన్ని పనులపై మాత్రమే కదలిక కనిపించగా, మిగతా అంశాలపై అధికారిక ప్రకటన లేకపోవడంతో ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.