గిరిజనుల సంక్షేమ అభివృద్ధికి కృషి
ఉట్నూర్ ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్
ఉట్నూర్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి) : సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కొరకు పని చేస్తుందని ఉట్నూర్ ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మా ట్ అన్నారు. శుక్రవారం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ కార్యాలయ సమావేశ మంది రంలో డిప్యూటీ కలెక్టర్ల బృంద సభ్యులతో సంక్షేమ పథకాల అమలు, గిరిజనులకు కల్పిస్తున్న విద్య, వైద్యం, గిరిజనులకు, పి.వి.టి.జి. లకు అందిస్తున్న సంక్షేమ పథకాల ఫలాలపై చర్చించారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అధికార యంత్రాంగం సమన్వయంతో సమర్ధవంతంగా అమలు చేస్తూ అర్హులైన గిరిజనులకు పథకాల ఫలాలు అం దేవిధంగా క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా బృంద సభ్యులు మాట్లాడుతూ తమలో ఎక్కువ మంది అధికారులు వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చిన వారు ఉన్నారని తెలిపారు. బృంద సభ్యులు వివిధ రకాల పంటలకు సంబంధించిన పలు ప్రశ్నలను ఆసక్తిగా అడిగి సమాచారాన్ని తెలుసుకున్నారు.
అనంతరం ఉట్నూర్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో కల్పిస్తున్న వైద్య సేవలు, మందుల నిల్వల వివరాలు, ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు.




