కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శికి ఘనసన్మానం
04-04-2026 12:08 AM
ఎర్రుపాలెం ఏప్రిల్ 3 (విజయక్రాంతి): మండల పరిధిలోని పెగళ్లపాడు గ్రామానికి చెందిన సగ్గుర్తి వెంకటనారాయణ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైయారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ మండలాల వారిగా కేటాయించిన పదవుల్లో భాగంగా పెగళ్ళ పాడు మాజీ సర్పంచ్ సగ్గుర్తి వెంకట నారాయణ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా ఎన్నికైనందున ఖమ్మంలో ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ మంగళపూడి వెంకటేశ్వర్లు అభినందించి శాలువాతో సత్కరించారు. ఇంకా మున్ముందు మెరుగైన పదవులు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాకర్లమూడి అనిల్ పాల్గొన్నారు.




