02-02-2026 12:00:00 AM
భీమదేవరపల్లి, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): హుస్నాబాద్ నియోజకవర్గం ముల్కనూర్ గ్రామంలో నలభై ఐదు సంవత్సరాల క్రితం స్థాపించిన సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా అమ్మ వార్లను భీమదేవరపల్లి సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కేతిరి లక్ష్మారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవార్ల ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరు, హుస్నా బాద్ నియోజకవర్గ ప్రజలు పాడి పంటలతో పిల్ల పాపలతో సుభిక్షంగా ఉండాలని ఆమ్మ వారిని వేడుకున్నట్టు చెప్పారు.
వనం నుండి జనంలోకి వచ్చిన వనదేవతలను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో (మేడారం తర హాలో) భక్తులు రావడం సంతోషం అన్నా రు. జాతరకు వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసిన జా తర కమిటీ చైర్మన్ జక్కుల ఐలయ్య, సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి కీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వంగర సర్పంచ్ గజ్జెల సృజన రమేష్, జక్కుల అనిల్ యాదవ్, మాడుగుల గోపీ, దొంతరబోయిన శ్రీనాధ్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.