02-02-2026 12:00:00 AM
రాధాస్ ఆయుర్వేద హాస్పిటల్ చొరవ
ఖైరతాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): శ్రీనివాసన్ మునుస్వామి రాధా అద్దంకి ట్రస్ట్ - రాధాస్ ఆయుర్వేద హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ సభ్యులకు ఇమ్యూనిటీ కిట్లను పంపిణీ చేశారు. ఆదివారం ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన కార్యక్ర మంలో కిట్లతో పాటు మోకాళ్ల నొప్పులకు ఔషధాలను అందజేశారు. ఈ సందర్భంగా రాధాస్ ఆయుర్వేద హాస్పిటల్, ఓజస్కా చైర్మన్ డాక్టర్ శరత్ అద్దంకి మాట్లాడుతూ జర్నలిస్టులు నిత్యం వార్తలతో కుస్తీ పడుతుంటారన్నారు.
టైంతో పాటు పరుగులు తీసే జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్ తో కలిసి ఇంటిగ్రేటెడ్ క్యాన్సర్ చికిత్సల గురించి అవగా హన కల్పించే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రమేశ్ వరికుప్పల రాధాస్ ఆయుర్వేద హాస్పిటల్ చైర్మన్ శరత్ అద్దంకితో పాటు హాస్పిటల్ బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు.