02-02-2026 12:00:00 AM
మహబూబాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా తొర్రూరు లో 4.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తొ ర్రూర్ డిఎస్పీ కృష్ణకిషోర్ తెలిపారు. డీఎస్పీ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తొర్రూరు పోలీస్ స్టేషన్ 2వ ఎస్‌ఐ ఎం. శివరామకృష్ణ, తమ సిబ్బందితో కలిసి ఆదివారం ఉదయం తొర్రూరు బస్టాండ్ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా హైదరాబాద్ బస్సులు నిలిచే ప్లాట్ఫారం వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా గమనించి, వారిని అదుపులోకి తీసు కుని విచారించగా, విశాఖపట్నం నుండి హైదరాబాద్కు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు వెల్లడించారన్నారు.