రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
30-05-2026 09:42 PM
ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన సర్పంచ్ కొడప ప్రకాష్
జైనూర్,(విజయక్రాంతి): జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. మండల కేంద్రంలోని ఆసుపత్రిని శనివారం ఆయన సందర్శించి రోగులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి వెంటనే వైద్యం అందించాలని, వైద్య సిబ్బంది అందరూ ఆసుపత్రిలోనే అందుబాటులో ఉండాలని వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. ఆసుపత్రిలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్శనలో నాయకుడు ఆడ అమృత్ రావు తదితరులు పాల్గొన్నారు.






