25 July, 2026 | 1:47 AM

డిప్యూటీ సీఎంను కలిసిన సర్పంచ్ నాగరాజు

25-07-2026 12:00 AM

బూర్గంపాడు,జూలై24 (విజయక్రాంతి): తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను బూర్గంపాడు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మందా నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మం డల పర్యటనకు వచ్చిన ఉప ముఖ్యమంత్రిని కలిసి బూర్గంపాడు గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం స హకరించాలని వినతి చేసినట్లు తెలిపారు.