17-12-2025 02:52:32 PM
హైదరాబాద్: తెలంగాణలో నూతన గ్రామపంచాయతీల సర్పంచ్ ల అపాయింట్‌మెంట్ డే వాయిదా పడింది. ఈనెల 20వ తేదీన బాధ్యతలు స్వీకరించాల్సిన సర్పంచ్ ల అపాయింట్ డేను ఈనెల 22కు వాయిదా వేయాలని ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ 20న జరగాల్సిన అపాయింట్ మెంట్ డేను 22వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా నూతన సర్పంచులు ఈనెల 22న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.