28 June, 2026 | 1:57 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

ఉపాధ్యాయ వృత్తిని కించ పర్చేలా ఉన్న విద్యా కమిషన్ రిపోర్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం

27-02-2026 09:54 PM

 పీఆర్టీయూటీఎస్ స్టేట్ కన్వీనర్ కర్రు సురేష్

మంథని,(విజయక్రాంతి): ఉపాధ్యాయ వృత్తిని కించ పర్చేలా ఉన్న విద్యా కమిషన్ రిపోర్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామని *పీఆర్టీయూటీఎస్  స్టేట్ కన్వీనర్ కర్రు సురేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం పూర్తి అవగాహన లోపం, ఉపాధ్యాయ వృత్తి ఏేపట్ల కుంచిత స్వభావంతో ప్రభుత్వానికి సమర్పించిన విద్యా కమిషన్ రిపోర్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఉపాధ్యాయ వృత్తిని ఆర్ధిక దృక్కోణంలో చూడడం దురదృష్టకరమని, నైతిక విలువలని పెంపొందించి మానవ వనరులను అభివృద్ధి చేసి దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే ఉపాధ్యాయ వృత్తిని కార్పొరేటు ఉద్యోగి ల చూడడం, జీతాలు ఎక్కువని, ప్రమోషన్లు ఇవ్వొద్దని,

ఉపాధ్యాయ నియామకాల్లో క్షేత్ర స్థాయిలో సాధ్యం కాని ప్రతిపాదనలు చూస్తుంటే ఎంతటి అవగాహన రాహిత్యం తో తయారు చేసిన రిపోర్ట్ అనేది అర్థమౌతుందని, నిర్మాణాత్మక ఆలోచనలతో కాకుండా విమర్శనాత్మకంగా కమిషన్ కు సంబంధం లేని విషయాలను ప్రస్తావించి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న ఈ విద్యా కమిషన్ రిపోర్ట్ ను వెంటనే రద్దు చేసి,ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కై  సూచనలను క్షేత్ర స్థాయి లో అనుభవం ఉన్న సీనియర్ ఉపాధ్యాయులనుండి,మేధావుల నుండి సేకరించాలని సురేష్ కోరారు.