16 June, 2026 | 4:19 PM

సర్పంచ్ పోచయ్యకు మైనార్టీ సోదరుల సన్మానం

16-06-2026 03:45 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): రాజంపేట గ్రామపంచాయతీలో చేపడుతున్న అభివృద్ధి, పరిశుభ్రత కార్యక్రమాలకు గుర్తింపుగా సర్పంచ్ బుర్సా పోచయ్యను మైనార్టీ సోదరులు ఘనంగా సన్మానించారు. హుద్ద మజీద్ ఖబ్రస్తాన్ పరిసరాల్లో చెట్లు, పొదలు తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఖబ్రస్తాన్‌కు కాంపౌండ్ వాల్ నిర్మించాలని కోరగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో హుడా మజీద్  సర్దార్ ముబీన్, అబ్దుల్లా, నాసర్, అబ్బు, ముబాషిర్, సలీం, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.