సి.ఎస్.ఆర్ నిధులతో ఓపెన్ జిమ్ ప్రారంభం
16-06-2026 01:44 PM
ముకరంపుర, జూన్ 16(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని 45వ డివిజన్ మంకమ్మతోట లో నూతనంగా ఏర్పాటు చేసిన 'ఓపెన్ జిమ్'ను మేయర్ కొలగాని శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన 'ఫిట్ ఇండియా' నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక సహకారంతో, సీఎస్ఆర్ నిధులను వెచ్చించి నగరంలో ఈ ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో 45వ డివిజన్ కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ-శ్రీనివాస్,బీజేపీ నాయకులు,కాలనీ వాసులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.






