19 May, 2026 | 2:48 PM

ఉచిత హెల్త్ క్యాంపులను సద్వినియోగం సర్పంచ్ సుగుణ

19-05-2026 01:45 PM

బోథ్ : ప్రధాన మంత్రి జన్ మాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బోథ్ మండలంలోని పట్నాపూర్ గ్రామపంచాయతిలో సబ్ సెంటర్ ఆధ్వర్యంలో సర్పంచ్ పంద్రం సుగుణ అధ్యక్షతన మెగా హెల్త్ క్యాంపు ను ఏర్పాటు చేయడం జరిగింది ఈసందర్బంగా గ్రామస్తులకు డాక్టర్ ప్రియాంక ఆధ్వర్యంలో బిపి షుగర్ జనరల్ ఓపి మలేరియా టెస్టులను ఉచితంగా చేసి టాబ్లెట్ లను అందించడం జరిగింది వడదేబ్బ నివారణకు ఓఆర్ఎస్ ప్యాకెట్ లను ప్రజలకు అందించడం జరిగింది ఇలాంటి ఉచిత వైద్య క్యాంపు లను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆత్రం మోహన్ పరిశీలకులు ఆర్ఎస్ నాగోరావ్ వార్డుమెంబర్ తోడషం నిలకాంత్ రావ్ ఆత్రం దేవురావు సెక్రటరీ మితున్ పెస కోఆర్డినేటర్ జైతు మాజీ సర్పంచ్ గోపాల్ ఆశ యశోద గ్రామస్తులు పాల్గొన్నారు