28 June, 2026 | 8:14 AM

రచ్చపల్లి పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేసిన సర్పంచ్ స్వప్న

04-02-2026 04:08 PM

మంథని,(విజయక్రాంతి): మంథని మండలంలోని రచ్చపల్లి ఓల్డ్ పాఠశాల లో  ప్రీ ప్రైమరీ సాంక్షన్  అయినందున తెలంగాణ ప్రభుత్వం నుండి పాఠశాల ప్రీ ప్రైమరీ విద్యార్థులకు బుధవారం యూనిఫామ్, బెల్ట్, షూ సర్పంచ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ  కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్, పాఠశాల హెచ్ ఎం హేమలత, సీఆర్ పీ సుప్రజ, ప్ర ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ సాయి ప్రసన్న, సుమలత, మమత తదితరులు పాల్గొన్నారు.