15-10-2025 08:22:48 PM
దౌల్తాబాద్: మండల పరిధిలోని మాచిన్‌పల్లి గ్రామ సమీప మల్లన్నగుట్ట ప్రాంతంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. నిన్న సాయంత్రం గ్రామస్థులు పొలాల వద్దకు వెళ్లిన సమయంలో చిరుత పులి కనిపించినట్లు తెలిపారు. ఈ సమాచారంతో అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. చిరుత జాడలను గుర్తించేందుకు అధికారులు మల్లన్నగుట్ట పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాత్రి సమయంలో పొలాల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ అధికారులు సూచించారు.