ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్పంచ్‌లకు ఓటు హక్కు కల్పించాలి
వారికి గౌరవ వేతనం రూ.50 వేలకు పెంచాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల
సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షుడిగా యతీశ్వర్ గౌడ్
హైదరాబాద్, మే 1(విజయక్రాంతి): స్థానిక సంస్థల ద్వారా ఎన్నికయ్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్పంచ్‌లకు కూడా ఓటు హక్కు కల్పిం చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ సర్పంచ్‌ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి జాజుల ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సర్పంచ్‌ల హక్కుల కోసం పోరాడుతున్న యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మం డల్ రాఘవాపురం సర్పంచ్ ఎరుకల యతీశ్వర గౌడ్‌ను తెలంగాణ సర్పంచ్‌ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు.
ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ స్థానిక సంస్థల ద్వారా ఎన్నుకోబడే శాసనమండలి సభ్యుల ఓటు హక్కు విషయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఓటు హక్కు కల్పించి సర్పంచ్‌లకు కల్పించకపోవడం చాలా అన్యాయమన్నారు. సర్పంచ్‌ల గౌరవ వేతనం కూడా 50 వేలకు పెంచాలని ఆయన డి మాండ్ చేశారు. సర్పంచ్‌ల వద్ద పనిచేసే గ్రామ పంచాయతీ స్వీపర్‌కు 10 వేల నుంచి15వేల వరకు ఇస్తున్న ప్రభుత్వం సర్పంచ్‌లకు మాత్రం 6,500 రూపాయలు మాత్రమే ఇవ్వడం ఎంతవరకు సమంజసమని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
రాష్ట్ర స ర్పంచ్‌ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ యతీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ఎంతో విశ్వాసంతో రాష్ట్ర బాధ్యతలు నాపై ఉంచినందుకు సర్పంచ్‌లకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో ప్రజల తో ప్రత్యక్షంగా ఎన్నికైన సర్పంచ్‌లకు, పరోక్షంగా ఎన్నికైన ఉపసర్పంచ్ లకు జాయింట్ చెక్ పవర్ కల్పించడం చాలా దారుణమని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ చెక్ కవ ర్‌ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చే శారు.
సర్పంచ్‌ల హక్కుల కోసం భవిష్యత్తులో రాజీ లేకుండా పోరాటం చేస్తానని యతేశ్వర్ గౌడ్ తెలిపారు. సర్పంచ్‌ల సం ఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షుడిగా ఎన్నికైన యతేశ్వర్ గౌడ్‌ను బీసీ సంఘాల నేతలు ఘ నంగా సన్మానించారు. కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు బత్తిని రాజు గౌడ్, మాజీ సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర సలహాదారులు ఘనగాని మల్లేష్, గొడుగు మహేష్ యాదవ్, తాటికొండ విక్రం, మహే ష్ మేరు, ప్రవీణ్ ముదిరాజ్ పాల్గొన్నారు.






