బిఆర్ఎస్ కు షాక్ .....
08-07-2026 07:30 PM
కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇద్దరు సర్పంచులు, వార్డు సభ్యులు
పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో బుధవారం మండలంలోని ఇద్దరు సర్పంచ్ లతోపాటు పలువురు వార్డు సభ్యులు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు, కదంబపూర్ సర్పంచ్ కర్రె గట్టయ్య , కనుకుల సర్పంచ్ కర్రే కవిత కుమార్ తో పాటు పలువురు వార్డు సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా ప్రభుత్వ విప్ , పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.






