8 July, 2026 | 8:04 PM

Breaking News

నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •  

బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు

08-07-2026 07:32 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సాయి కృపా నగర్ కాలనీలో నూతనంగా ప్రారంభించిన ఆదిత్య పాఠశాల పై విద్యార్థి సంఘాల నాయకులు బుధవారం మున్సిపల్ కమిషనర్ గోపి గంగాధర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ పాఠశాలకు సంబంధించి తప్పుడు పత్రాలు సమర్పించి విద్యాశాఖ నుండి అనుమతి పొందడం జరిగిందని, విద్యార్థి సంఘాల దృష్టికి రావడం జరిగింది.

కావున ఆ పాఠశాలకు సంబంధించినటువంటి పత్రాలను అధికారులు మళ్లీ ఒకసారి క్షుణ్ణంగా తనిఖీ చేయాలని  విద్యార్థి సంఘాల తరఫున అధికారులను డిమాండ్ చేశారు. విచారణ చేసిన అనంతరం పూర్తి నివేదిక ఉన్నత అధికారులకు అందజేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డి ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు జీవన్ రాథోడ్, బీసీ విద్యార్థి సంఘం డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు విజయ్ కుమార్, రాఘవేంద్ర పాల్గొనడం జరిగింది.