సర్వాయి పాపన్న పోరాటం స్ఫూర్తిదాయకం
రాష్ట్ర వ్యాప్తంగా పాపన్నకు ఘన నివాళులు
పాల్గొన్న అధికారులు, నేతలు, ప్రజాప్రతినిధులు
హైదరాబాద్/రాజన్న సిరిసిల, ఆగస్టు 18 (విజయక్రాంతి): రాజ్యాధికారం కోసం సర్దార్ సర్వాయి పాపన్న చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమపి, ఆయన చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బడుగు, బలహీన వర్గాలను ఐక్యం చేసి ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్న పాపన్నగౌడ్ గోల్కొండ కోటను జయించాడని కొనియాడారు.
కల్లుగీత కార్మిక విభాగం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న 374వ జయంతిని ఆదివారం గాంధీభవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం హాజరై మా ట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమా ర్‌యాదవ్, కల్లుగీత కార్మిక విభాగం అధ్యక్షుడు నాగరాజ్‌గౌడ్ పాల్గొన్నారు.
పాపన్న పోరాటం దేశభక్తికి నిదర్శనం: కిషన్‌రెడ్డి
బహుజనులకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కల్పించిన బహుజన బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న అని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన వీరోచిత పోరాటాలను గుర్తుచేసుకోవడం గర్వకారణమాన్నరు. ఆదివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దోపిడీకి వ్యతిరేకంగా సర్వాయి పాపన్న చేసిన సాహసోపేత పోరాటం ధైర్యానికి, దేశభక్తికి నిదర్శనమని కిషన్‌రెడ్డి తెలిపారు.
సర్వాయి పాపన్న పోరాటంతో బహుజనులకు స్వేచ్ఛ: కె లక్ష్మణ్
బహుజనులకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం కల్పించిన మొదటి తెలుగు బిడ్డ సర్వాయి పాపన్న అని బీజేపీ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం పాపన్న జయంతిని నిర్వహిస్తూ, మరోవైపు బీసీలను అన్యాయానికి గురి చేస్తోందని మండిపడ్డారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్ దానిపై స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో ఆయన చిత్రపటానికి లక్ష్మణ్ పూల మాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఉన్నారు.
ట్యాంకుబండ్‌పై పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలి: బీఆర్‌ఎస్
హైదరాబాద్/రాజన్న సిరిసిల్ల(విజయక్రాంతి): సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని, రాష్ర్టంలోని ఒక జిల్లాకు ఆయన పేరును పెట్టాలని మాజీ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని సర్దార్ సరాయి పాపన్నగౌడ్ విగ్రహానికి కేటీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిరిసిల్ల పట్టణంలోని మార్కండేయ ఆలయంలో నిరహిస్తున్న సహస్ర మహాచండి యాగంలో పూజలు నిర్వహించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో పాపన్నగౌడ్ చిత్రపటా నికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, బూడిద భిక్షమయ్యగౌడ్, పొన్నాల లక్ష్మయ్య, పల్లె రవికుమార్, ఆంజనేయగౌడ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ , రాంనర్సింహగౌడ్ పూలమాల వే సి నివాళులర్పించారు. పాపన్న జీవిత చరిత్ర నుబ పాఠ్యంశంలో పెట్టాలన్నారు.
కరీంనగర్ జిల్లా అల్గునూరులో
సర్దార్ సర్వాయి పాప్నగౌడ్ జయంతి వేడుకలను అల్గునూరులో నిర్వహించారు. మానేరు బ్రిడ్జిపై ఉన్న సర్వాయిపాపన్నగౌడ్ విగ్రహానికి మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. పాపన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం, పాపన్న విగ్రహానికి ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పొన్నం శ్రీనివాస్‌గౌడ్, పొన్నం సత్యనారాయణగౌడ్, కరీంనగర్ జిల్లా గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి మాచర్ల అంజయ్యగౌడ్ పాల్గొన్నారు.
వివిధ జిల్లాల్లో వేడుకలు
కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి గీత పారిశ్రామిక సహకార సంఘం, పాపన్న విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన సర్వాయి విగ్రహాన్ని మాజీ మం త్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండ లం సీతారాంపురంలో పాపన్న విగ్రహాన్ని బీఆర్‌ఎస్ జిల్లా నేత బబ్బూరి శ్రీకాంత్‌గౌడ్ ఆవిష్కరించారు. జనగామ కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఆసిఫాబాద్ కలెక్టర్ కార్యాలయంలో బీసీ సంక్షేమాశాఖ అధికారి సజీవ న్ అధ్యక్షతన వేడుకలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణం, గొల్లపెల్లి మండలం చిలకోడూర్, ఎండపెల్లి మండ లం గుల్లకోటలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.






