15 June, 2026 | 11:10 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

శంకర్‌పల్లి చైర్మన్‌గా సాత ప్రవీణ్‌కుమార్

17-02-2026 12:00 AM

శంకర్‌పల్లి, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): శంకర్ పల్లి మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడ్డాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాత ప్రవీణ్ కుమార్ చైర్మన్గా ఎన్నిక కాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూలకంటి శ్వేతా పాండురంగారారెడ్డి వైస్ చైర్మన్గా ఎన్నుకోబడ్డారు. మొత్తం 15మంది కౌన్సిలర్లు ఎన్నిక ప్రక్రియలో పాల్గొని తమ ఓట్లను వినియోగించారు.

ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సాఫీగా ముగిశాయి. అధికారుల పర్యవేక్షణలో పారదర్శకంగా ఓటింగ్ నిర్వహించారు. చైర్మన్గా ఎన్నికైన సాత ప్రవీణ్ కుమార్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని, అన్ని వార్డులకు సమాన ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు. వైస్ చైర్మన్ శ్వేత పాండురంగరెడ్డి కూడా ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానన్నారు.

మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీ నాయకులు, స్థానికులు హాజరయ్యారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో మున్సిపాలిటీలో కొత్త పాలకవర్గం ఏర్పడింది. ప్రశాంత మైన వాతా వరణంతో కాన్సులర్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ ఎం పీ రంజిత్ రెడ్డి నూతనం గా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులను సన్మానించారు.