calender_icon.png 17 February, 2026 | 11:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇబ్రహీంపట్నం ఎన్నికలో తీవ్ర ఉద్రిక్తత

17-02-2026 12:00:00 AM

అబ్దుల్లాపూర్‌మెట్, ఫిబ్రవరి 16:  ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో సోమవారం జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సమావేశంలో సభ్యుల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంది. దీంతో చైర్మన్,  వైస్ చైర్మన్ ఎన్నికను రేపటికి వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి ఆర్డీవో అనంతరెడ్డి తెలిపారు. వాయిదా అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి వెళ్లిన ఎమ్మెల్యే మల్ రెడ్డి  రంగారెడ్డి, కాగా కౌన్సిలర్లు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సమయంలో మున్సిపల్ కార్యాలయంపై ఒక్కసారిగా రాళ్ల దాడి జరిగింది.

మళ్లీ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొనగా రెండు సార్లు వాయిదా వేసినా, చైర్మన్,  వైస్ చైర్మన్ ఎన్నికలో ఉద్రిక్తత ఏర్పడగా ఆర్డీవో అనంతరెడ్డి, ఈ  ఎన్నికను మంగళవారానికి వాయిదా వేయడం జరిగింది. దీంతో ఇరువర్గాల వారు మొదటగా కాంగ్రెస్ వాళ్ళు తమ కోరంను మున్సిపల్ కార్యాలయం నుంచి తరలించగా, అనంతరం బీఆర్‌ఎస్ కౌన్సిలర్లను రంగారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి,  రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తమ కొరంను భారీ బందోబస్త్ మధ్య మున్సిపల్ కార్యాలయం నుంచి రహస్య ప్రదేశాలకు తరలించారు.