15 June, 2026 | 10:01 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

పుట్టిన ఊరు రుణం తీరనిది

17-02-2026 12:00 AM

నూతనకల్, ఫిబ్రవరి 16: కన్నతల్లి, జన్మనిచ్చిన ఊరు రుణం తీరనిదని ప్రవాస భారతీయుడు డాక్టర్ మర్రి సత్యనారాయణ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని చిల్పకుంట్ల ప్రాథమికోన్నత పాఠశాలలో తాను బాల్యంలో విద్యనభ్యసించిన పాఠశాలకు మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక సహాయం అందజేసి, ప్రస్తుతం విద్యనభ్యసిస్తున్న చిన్నారులకు సొంత ఖర్చులతో బ్యాగులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, స్వచ్ఛంద సంస్థలు, దాతలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం సత్యనారాయణ రెడ్డిని గ్రామస్తులు శాలువాలతో, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంజపల్లి నరసమ్మ, ట్రాఫిక్ సిఐ అంజపల్లి నాగమల్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నన్నేబోయిన సోమయ్య, గ్రామ పెద్దలు కందాల శంకర్ రెడ్డి, పెద్దింటి రంగారెడ్డి, బాణాల సుదర్శన్ రెడ్డి, పులుసు సత్యం, సామ సురేందర్ రెడ్డి, బొజ్జ శీను, ఎల్లావుల నరేష్ పాల్గొన్నారు.