calender_icon.png 5 December, 2025 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదల ఆకలి తీర్చిండు..

05-12-2025 01:51:27 AM

విద్యార్ధి మోక్షిత్‌కి పలువురు అభినందనలు

శంకర్‌పల్లి, డిసెంబర్ 4(విజయక్రాంతి): తన జన్మదినం పురస్కరించుకొని విద్యార్థి మోక్షిత్ సేవా భావాన్ని చాటుకున్నాడు. గురువారం శంకర్‌పల్లికి చెందిన కాంట్రాక్టర్ సుమన్ కుమారుడు  మోక్షిత్ పుట్టినరోజు సందర్భంగా గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని తన తండ్రి తో కలిసి అన్నదాన వితరణ చేపట్టాడు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి, రైల్వే స్టేషన్ ప్రాంతంలోని అభాగ్యులకు, కూలీలకు, మోకిలా తాండలోని కార్మికులకు, కర్షకులకు మొత్తం 400 మందికి ఒక్క పూట అన్నదానం చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.

అందరు చిన్నారులగా బర్త్డే వేడుకలకు కోసం ఖర్చు చేసే డబ్బులను వృధా చేయకుండా ఇలా సామాజిక సేవకు వినియోగించాడు.  ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షుడు నరేష్ కుమార్ మాట్లాడుతూ సంపాదనలో కొంత దానం చేయడం పేదలకు సహాయం చేసే దృక్పథం ప్రతి ఒక్కరిలో రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థి తండ్రి సుమన్ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేయాలన్నారు.  అనంతరం విద్యార్థి మోక్షిత్ ను నిరుపేదలందరూ అభినందించి ఆశీర్వదించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి, జనరల్ సెక్రెటరీ వేనేంద్ర చారి పాల్గొన్నారు.