05-12-2025 01:50:18 AM
మొయినాబాద్, డిసెంబర్ 4: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం సంచాలకులు మహ్మద్ అలీఖాన్ ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుద్యోగులకు సీసీ కెమెరా రిపేరింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలోని చిలుకూరు గ్రామంలో గల మహిళా ప్రాంగణం ఆవరణంలో ఉన్న ఎస్బీఐ-గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ యందు 13 రోజుల పాటు సీసీ కెమెరాల శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
శిక్షణ పొందాలనుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని సూచించారు. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారికి శిక్షణ పొందడానికి దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తుకు పదవ తరగతి మెమో, ఆధార్కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం, నాలుగు పాస్పోర్టు సైజు ఫొటోలు జతపర్చాలని చెప్పారు.
ఈ నెల 8వ తేది లేపు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణ కాల పరిమితి 13 రోజుల పాటు ఉచిత శిక్షణతో పాటు ఉచిత భోజనం, వసతి కల్పించడం జరుగుతుందని తెలిపారు.కావున అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.