21 August, 2026 | 4:35 PM

Breaking News

శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం   •   తంగళ్లపల్లి ఎస్‌హెచ్‌ఓ సిరిసిల్ల అశోక్ బాధ్యతల స్వీకరణ   •   పాఠశాల ప్రిన్సిపాల్ రూపా రెడ్డి ఘటనపై ఉట్నూర్ ఏఎస్పీ భరసా   •   సింగరేణి హెల్త్ కార్డుల్లో వ్యత్యాసాలు సరికాదు   •   హల్ద్వానీ ఘటనపై మంథనిలో కాంగ్రెస్ నిరసన   •   అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం: మార్కెట్ చైర్మన్   •   రైతు బీమా, కళ్యాణలక్ష్మి పథకాలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ   •   సరిహద్దులు సురక్షితంగా ఉంటేనే.. భారత్ సురక్షితం   •   విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినియోగదారుల వినతి   •  

నంబర్‌వన్ నుంచి సాత్విక్ జోడీ ఔట్

12-06-2024 12:46 AM

న్యూఢిల్లీ: భారత డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ శెట్టి నంబర్‌వన్ ర్యాంక్‌ను కోల్పోయారు. మంగళ వారం బీడబ్ల్యూఎఫ్ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో డబుల్స్‌లో సాత్విక్ జోడీ మూడో స్థానానికి పడిపోయింది. గత నెలలో థాయ్‌లాండ్ ఓపెన్ విజేతగా నిలిచిన ఈ జంట నంబర్‌వన్ ర్యాంకును అధిరోహించింది. అయితే ఆ తర్వాత జరిగిన సింగపూర్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లో పరాజయం, ఇండోనేషియా ఓపెన్ నుంచి వైదొలగడం సాత్విక్ జోడీ ర్యాంకింగ్‌పై ప్రభావం చూపింది. చైనాకు చెందిన లియాంగ్ వీ కెంగ్ చాంగ్‌లు నంబర్‌వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. మహిళల సింగిల్స్ విభాగంలో భారత టాప్ షట్లర్ పీవీ సింధు 10వ ర్యాంక్‌లో నిలవగా.. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్‌లు వరుసగా 10, 14 స్థానాల్లో నిలిచారు. కిడాంబి శ్రీకాంత్ నాలుగు స్థానాలు దిగజారి 32వ స్థానానికి పడిపోయాడు.