30 August, 2026 | 10:51 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

సెమీస్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ

30-05-2026 01:03 AM

ధృవ్-తనీశా జోడీ ముందంజ

సింధు, లక్ష్యసేన్ ఔట్

సింగపూర్: సింగపూర్ ఓపెన్‌లో భారత్ కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. టైటిల్‌పై ఆశలు రేకెత్తిస్తున్న పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి సెమీఫైనల్లో అడుగుపెట్టారు. క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ జోడీ  19- 21- 21- స్కోరుతో మలేషియాకు చెందిన కాంగ్ ఖాయ్‌గ్జింగ్ అరోన్ తాయ్ జోడీని చిత్తు చేసింది.

తొలిసెట్‌ను 19- కోల్పోయిన తర్వాత భారత జంట అద్భుతంగా పుంజుకుంది. రెండో గేమ్ గెలిచి స్కోర్ సమం చేయడంతో పాటు నిర్ణయాత్మక మూడో గేమ్‌లోనూ అదరగొట్టింది. ప్రత్యర్థికి ఎక్కడా అవకాశమివ్వకుండా ఆధిక్యం కనబరిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మిక్సిడ్ డబుల్స్‌లో ధృవ్ కపిల-తనీశా జోడీ కూడా సెమీస్‌కు చేరింది.

క్వార్టర్ ఫైనల్లో ప్రత్యర్థి జంట గాయంతో వైదొలగడంతో భారత జోడీ ముందంజ వేసింది. మహిళల సింగిల్స్‌లో తెలుగుతేజం పీవీ సింధు పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. వరల్డ్ నెం.1 దక్షిణకొరియా ప్లేయర్ అన్ సేయాంగ్ 21 21- స్కోరుతో సింధును ఓడించింది. తొలి సెట్‌లో అటాకింగ్ గేమ్‌తో ఆకట్టుకున్న సింధుకు యాంగ్ షాకిచ్చింది. 17- కోల్పోయిన తెలుగు తేజం రెండో సెట్‌లోనూ స్థాయికి తగ్గట్టు ఆడలేదు. ఫలితంగా యాంగ్ 21 పైచేయి సాధించి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది.