14 July, 2026 | 6:32 PM

Breaking News

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •  

లక్నో కెప్టెన్సీకి పంత్ గుడ్ బై

30-05-2026 01:06 AM

ఎక్స్ వేదికగా ఫ్రాంచైజీ వెల్లడి

రెండు సీజన్లలో సారథిగా ఉన్న పంత్

పంత్ కెప్టెన్సీలో లక్నో ఫ్లాప్ షో

ముంబై, మే 29: ఐపీఎల్ సీజన్ ముగిసిపోతున్న వేళ పలు ఫ్రాంచైజీల్లో కీలక పరి ణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ నుంచి రిషబ్ పంత్ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని లక్నో ఫ్రాంచైజీ ఎక్స్ వేదికగా వెల్లడించింది.

తనను సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలని పంత్ కోరాడని, అతని నిర్ణయాన్ని మర్యాదపూర్వకంగా అంగీకరించినట్టు లక్నో ఫ్రాంచైజీ తెలిపింది. నిజానికి ఐపీఎల్ 19వ సీజన్ లీగ్ స్టేజ్‌లోనే లక్నో ఇంటిదారి పట్టినప్పుడు కెప్టెన్ల మార్పుపై వార్తలు వచ్చా యి. మీడియా సమావేశంలో ఆ ఫ్రాంచైజీ డైరెక్టర్ ఆఫ్ క్రికెటర్ టామ్ మూడీ కూడా హింట్ ఇచ్చాడు. కొన్ని అంశాలపై సమీక్ష జరగాల్సి ఉందంటూ పేర్కొన్నాడు. 

2025 లో కెఎల్ రాహుల్ లక్నోను వీడిన తర్వాత వేలంలో పంత్‌ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. అనంతరం జట్టు పగ్గాలు కూడా అప్పగించింది. అయితే నాయకుడిగా నూ, వ్యక్తిగతంగానూ పంత్ నిరాశ పరిచాడు. 2025 సీజన్‌లో లక్నో కేవలం ఆరు విజయాలే సాధించింది. అయినప్పటకీ 2026 సీజన్‌లోనూ ఫ్రాంచైజీ యాజమా న్యం అతనిపైనే నమ్మకముంచింది. అయితే ఈ సారి కూడా పంత్ ఘోరంగా విఫలమయ్యాడు.

పంత్ కెప్టెన్సీలో లక్నో ప్రస్తుత సీజన్‌లోనూ ప్లే ఆఫ్స్‌కు చేరలేకపోయింది. కేవలం నాలుగే విజయాలు సాధించి సీజన్‌ను అట్టడుగు స్థానంతో ముగించింది. గత సీజన్‌లో పంత్ 269 పరుగులు చేయగా.. ఈ సారి 314 పరుగు లు చేశాడు. ముఖ్యంగా మార్కరమ్ లాంటి ప్లేయర్‌ను పదేపదే వేర్వేరు స్థానాల్లో ఆడిస్తూ, బ్యాటింగ్ లైనప్‌ను కూడా చెడగొట్టుకున్నారంటూ ఫ్రాంచైజీపైనా విమర్శలు వచ్చాయి. చివరికి జట్టు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పంత్ తనంతట తానుగానే తప్పుకున్నాడు.