5 July, 2026 | 10:33 PM

గాయత్రి జోడీ బోణీ

22-05-2024 01:48 AM

కౌలాలంపూర్: మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పుల్లెల గాయత్రి గోపిచంద్ జాలీ జోడీ శుభారంభం చేసింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ టోర్నీ మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో మంగళవారం గాయత్రి జంట 21 21 చైనీస్ తైపీకి చెందిన హ్యుయాంగ్ లియాంగ్ టింగ్ ద్వయాన్ని ఓడించి రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వని ఈ జోడీ వరస గేముల్లో  విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో మాత్రం ఒక్కరు కూడా మెయిన్ డ్రాకు అర్హత సాధించలేకపోయారు. సతీష్ కుమార్, ఆయుష్ శెట్టి, శంకర్ సుబ్రమణియన్‌లు క్వాలిఫయింగ్ రౌండ్‌కే పరిమితమయ్యారు. మహిళల సింగిల్స్‌లో తాన్య హేమంత్, మహిళల డబుల్స్‌లో పాలక్ అరోరా హుడాలు పరాజయం పాలయ్యారు. భారత ఏస్ షట్లర్ పీవీ సింధు బుధవారం స్కాట్లాండ్‌కు చెందిన గిల్‌మోర్‌తో తలపడనుంది.