బేటీ బచావో బేటీ పడవో బైక్ ర్యాలీ
ఆందోల్, ఫిబ్రవరి 6 : జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ,జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో భేటీ బచావో భేటీ పడావో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆందోల్ మున్సిపల్ కార్యాలయంలో కార్య క్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆడపిల్ల ప్రాముఖ్యతను తెలియజేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది, ఈ ర్యాలీ లో అధికారులు ఆడపిల్లలను చదివించాలి, రక్షించాలి, ఎదగనివ్వాలి, బ్రతికనివ్వాలి అనే నినాదాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
అదే విధంగా ఆర్డీవో కార్యాలయం లో మరియు మున్సిపల్ కార్యాలయం లో మొక్కలు నాటి భేటీ బచావో భేటీ పడవో ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం లో ఆర్డిఓ పాoడు, తహసిల్దార్ విష్ణు సాగర్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, జిల్లా సమన్వయకర్త పల్లవి, పోలీస్ శాఖ సిబ్బంది, షి టీమ్ సిబ్బంది, కార్యాలయం సిబ్బంది, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.






