22 April, 2026 | 10:01 PM

టెర్రరిజాన్ని తరిమేద్దాం... దేశాన్ని రక్షించుకుందాం

22-04-2026 08:56 PM

ముకరంపుర,(విజయక్రాంతి): బైసారన్ లోయ జమ్మూ కాశ్మీర్లోని పహల్ గాంలో పాకిస్థానీ ఉగ్రవాదులు మారణకాండ సృష్టించి 27 మంది అమాయకులను నిర్ధాక్షిణ్యంగా వారి భార్యా బిడ్డలు, కుటుంబ సభ్యుల కళ్లెదుటే చంపిన ఉన్మాద ఘటన  ఏప్రిల్ 22, 2025న జరిగిన విషయం అందరికీ తెలిసిందే, పహాల్గామ్ లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది అమాయక ప్రజల స్మృత్యర్థం బుధవారం నాటికి సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంగా  పహల్గాంలోని లీడ్డర్ నది ఒడ్డున నల్లటి చలువ రాతి స్మారక పలక మీద 26 మంది పేర్లను చెక్కారు.

ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటిస్తూ, శాతవాహన ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ ఫోరం బాధ్యులు మాట్లాడుతూ ఈ దేశంలో  అక్కడక్కడ ముఖ్యంగా విద్యాసంస్థలలో కొందరు ముష్కర భావాలతో మత్తు లాంటి టెర్రరిజాన్ని విద్యార్థుల మనస్సుల్లోకి చొప్పించి ఈ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశభక్తికి వ్యతిరేకంగా ప్రవర్తించే ఉగ్రవాదులను, గుర్తించి వారిని కఠినంగా శిక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫోరం బాధ్యులు  డాక్టర్ పెంచాల శ్రీనివాస్, కోట శ్యామ్ కుమార్, బెల్లపు కర్ణాకర్, ఎండి ఉమర్,  తదితరులు పాల్గొన్నారు.