పోచారం ప్రాజెక్టును సందర్శించిన సీడీఎస్ఈ
22-04-2026 09:02 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): డ్యామ్ సేఫ్టీ ఆక్ట్ లో (సిడిఎస్ఇ) భాగంగా ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్ విజయ్ దేశాయ్,మరియు సభ్యులు మురళీధర్,భవాని రామ్ శంకర్,సత్యనారాయణ, కలిసి మండలంలోని పోచారం ప్రాజెక్టును సందర్శించారు.ఈ సందర్భంగా పోచారం ప్రాజెక్టులోని వివిధ పరిసరాలను తిరిగి క్షుణ్ణంగా పరిశీలించి ప్రాజెక్టు కెపాసిటీ వ్యాసార్థం ప్రాజెక్టు చరిత్రను అడిగి తెలుసుకున్నారు. పోచారం ప్రాజెక్టు ఆయకట్టు విస్తీర్ణం పూర్తి వివరాలను ఎంతమేరా అందిస్తుందని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ యశ్విని, ఈఈ వెంకటేశ్వర్లు,ఏఈ అక్షయ ఉన్నారు.






