11 March, 2026 | 5:14 PM

సావిత్రిబాయి పూలే ఆశయాలు సాధించాలి

11-03-2026 01:22 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): ప్రతి ఒక్కరు సావిత్రిబాయి పూలే ఆశయాలు సాధించాలని ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అఖిల భారతీయ మాలీ సంఘం జిల్లా కార్యాలయంలో సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి వేడుకలు జిల్లా అధ్యక్షుడు గుర్నులే మెంగాజీ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అజ్మీరా శ్యామ్ నాయక్ వివిధ సంఘాల నాయకులతో కలిసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ మాలీ సంఘం గౌరవ అధ్యక్షుడు కవాడే దత్తు, ఎమ్మా ర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవ్ రావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్నార్ రమేష్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వైరగడే మారుతి పటేల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ విశ్వనాథ్, మాలీ సంఘం నాయకులు సెండే సోమేశ్వర్, హనుమంతు పాల్గొన్నారు.