డ్రగ్స్‌కు నో చెప్పండి.. ఆరోగ్యకర జీవితాన్ని పొందండి..
భూపాలపల్లి సీఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్
భూపాలపల్లి, జూలై 29 (విజయ క్రాంతి):డ్రగ్స్కు నో చెప్పండి ఆరోగ్యకర జీవితాన్ని పొందండనిభూపాలపల్లి సిఐ దొ మ్మాటి నరేష్ కుమార్ గౌడ్ అన్నారు. నషాముక్త్ యువవికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా పట్టణ సీఐ డి. నరేష్ కుమార్ గౌడ్ హాజ రై మత్తు పదార్థాల వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలను వివరిం చారు. డ్రగ్స్కు దూరంగా ఉండాలని, మంచి అలవాట్లు అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు.ఈ సందర్భంగా విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశా రు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, పోలీసు అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.






