శాకాంబరిగా వరంగల్ భద్రకాళి
- 11 క్వింటాళ్ల కూరగాయలతో అమ్మవారికి అలంకరణ
- పెద్ద ఎత్తునతరలి వచ్చిన భక్తులు
వరంగల్, (మహబూబాబాద్) జులై 29 (విజయక్రాంతి): వరంగల్ నగరంలో ప్రసిద్ధిగాంచిన భద్రకాళి ఆలయంలో శాకాంబరి వేడుకలు బుధవారం ఘనం గా నిర్వహించారు. శాకాంబరి నవరాత్ర ఉత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం వరంగల్ నగరంలోని భద్రకాళి అమ్మవారిని 11 క్వింటాళ్ల వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు.
మంగళవారం లక్ష్మీ శ్రీనివాస సేవా సమితి, మహబూబాబాద్ జీకే రెడ్డి ఆధ్వర్యంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి రామల సునీతకు తమ సేవాసమితి సభ్యులు సుమారు 11 క్విం టాళ్ల కూరగాయలు అమ్మవారికి సమర్పించారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి నిత్యాహిరం నిర్వర్తింపడిన అనంతరం అమ్మవారికి పలు రకాల కూరగాయలు, పండ్లతో శాకంబరీ అలంకారంనిర్వహించారు.
ఉదయం 9 గంటలకు శాకంబభరి రూపంలో భద్రకాళి అమ్మవారు భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తుల సౌకర్యార్థం సర్వదర్శనంతో పాటు విశిష్ట దర్శనం, అతిశీఘ్రదర్శనం, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భద్రకాళి అమ్మవారిని శాఖాంబరి విశ్వరూప దర్శనం కోసం ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.






