గుడుంబా కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు
ఏడుగురు వ్యక్తుల బైండోవర్
కేసముద్రం, ఆగస్టు 3 (విజయక్రాంతి): గూడూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని కేసముద్రం, ఇనుగుర్తి మండలాల్లోని గిర్ని తండ, ఎన్టీఆర్ నగర్, కట్టుకాలువ తండ, బ్రహ్మంగారి గుడి తండ, కొత్తూరు, లాలు తండాల్లోని నాటు సారాయి కేంద్రాలపై ఎక్సైజ్ ఎన్ఫోసిమెంట్, టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో తొమ్మిది కేసు నమోదు చేసి, 30 లీటర్ల నాటు సారాను, 20 కిలోల బెల్లం, 5 కిలోల పటిక ను స్వాధీనం చేసుకున్నారు.
అలాగే 1,100 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, ఏడుగురు వ్యక్తులను కేసముద్రం తహసిల్దారు ఎదుట బైండోవర్ చేసినట్లు గూడూరు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బిక్షపతి తెలిపారు. ఈ దాడులలో ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్లు నాగయ్య, చంద్రశేఖర్, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నీరజ, ఎస్త్స్ర కిరీటి, ఎస్త్స్ర ఎస్.రాజేశ్వరి, ట్రైని ఎస్త్స్ర ఎస్.సంతోష్ అలాగే కాజీపేట స్టేషన్, ఎస్‌ఐ తిరుపతి సిబ్బంది పాల్గొన్నారు.






