01-11-2025 07:36:05 PM
అశ్వాపురం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఎస్సీ కాలనీలో నిర్మాణం జరుగుతున్న ఇండ్లలో ఒకదానిని ప్రారంభిస్తూ ఇంటి దర్వాజా ఎత్తే కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గాదె కేశవరెడ్డి మాట్లాడుతూ నిజమైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం కాంగ్రెస్ పార్టీ పాలనలోనే సాధ్యమవుతుంది. ఇలాంటి పేదలకు సహాయం చేయగలగడం జీవితానికి సంతృప్తి ఇస్తుంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు బిల్లులు వేగంగా చెల్లిస్తున్నదని, లబ్ధిదారులు నాణ్యతతో ఇండ్లను త్వరగా పూర్తిచేయాలని సూచించారు.