01-11-2025 07:34:19 PM
అమీన్ పూర్: సంగారెడ్డి అమీన్ పూర్ కార్తీకమాస వనభోజన శనివారం అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గుట్ట శ్రీశ్రీ భ్రమరాంబిక శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గౌడ్స్ కమ్యూనిటీ సభ్యుల ఆధ్వర్యంలో కార్తీకమాస వనభోజన కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గౌడ్స్ కమ్యూనిటీ కుటుంబ సభ్యులందరూ ఐక్యమత్యంతో కలిసిమెలిసి ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరమని, ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు గౌడ సంఘం ముఖ్య నాయకులు, గౌడ బంధువులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.