calender_icon.png 2 November, 2025 | 10:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు ఢీకొని మహిళ మృతి..

01-11-2025 07:37:05 PM

యాచారం: రోడ్డు దాటుతున్న మహిళలను కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన శనివారం యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నందీశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కడ్తాల్, మండలం కొండ్రీగని బాద్ తండాకు చెందిన సభావత్ లాలి(37) తమ గ్రామానికి చెందిన బంధువులు మండల పరిధిలోని తమ్మలోని గూడ, గేటు వద్ద ఉన్న సత్యనారాయణ గార్డెన్లో విందు నిర్వహించగా.. కార్యక్రమానికి హాజరై తిరిగి తమ స్వగ్రామానికి వెళ్లడానికి బస్సు కోసం ఫంక్షన్ హాల్ వద్ద నాగార్జునసాగర్ రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుండి మాల్ వైపు అతివేగంగా వెళుతున్న క్లోజర్ బండి ఢీకొనడంతో సభావత్ లాలి(37)కి తీవ్రగాయాలు అయ్యాయి. మెరుగైన చికిత్స కోసం స్థానికులు హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.