3 August, 2026 | 8:49 AM

జార్జియాలో కారు బోల్తా

22-05-2024 02:38 AM

ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి

ఇద్దరికి గాయాలు

న్యూఢిల్లీ, మే 21: వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి బోల్తా పడడంతో ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతిచెందారు. ఈ ఘటన అమెరికాలోని జార్జియాలో మే 14న చోటుచేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది. మృతుల్లో ఇద్దరు యువతులు ఉన్నారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్యన్ జోషి, శ్రీయ అవసరాల, అన్వీ శర్మ, రిత్వక్ సోమేపల్లి, మహ్మద్ లియాఖత్ అనే ఐదుగురు భారతీయ విద్యార్థులు కారులో ప్రయాణిస్తుండగా.. అతివేగం కారణంగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో శ్రీయ, ఆర్యన్ అక్కడికక్కడే మృతిచెందగా అన్వీ శర్మ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించింది. మరో ఇద్దరు గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో రిత్వక్ కారు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతులంతా 18 ఏళ్ల వారే అని తెలిపారు. మృతుల్లో శ్రీయ, అన్వీ జార్జియా యూనివర్సిటీలో, ఆర్యన్ అల్ఫారెట్టా హైస్కూల్ లో చదువుతున్నాడని పోలీసులు వెల్లడించారు.