11 August, 2026 | 1:17 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

భయంగొలిపే ‘భూల్ భూలయ్యా’

10-10-2024 12:00 AM

బాలీవుడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్, మాధురీ దీక్షిత్, విద్యాబాలన్, త్రిప్తి డిమ్రీ లీడ్ రోల్స్‌లో నటించిన తాజా కామెడీ హారర్ చిత్రం ‘భూల్ భూలయ్యా 3’. హిందీలో 2022లో బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన ‘భూల్ భూలయ్యా’ ఫ్రాంఛైజీలో మూడో భాగంగా ఈ చిత్రం రూపొందింది. దీపావళి కానుకగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మూవీ ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు.

ఫన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ట్రైలర్ సినిమాపై ఉత్కంఠను రేపుతోంది. ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ ట్రైలర్ దాదాపు మూడు నిమిషాల 50 సెకన్ల నిడివితో ఉన్న ట్రైలర్ హారర్ సీన్స్‌తో భయపెట్టేలా సాగింది. విద్యాబాలన్ అదిరిపోయే నటనతో మరోసారి భయపెట్టను న్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమా ఒక సింహాసనం కోసం జరిగే పోటీలా అనిపిస్తోంది.

విద్యాబాలన్‌లోని దెయ్యం.. తన సింహాసనం జోలికి ఎవరు రాకూడదని ఆగ్రహంతో ఊగిపోతూ ఉంటుంది. దెయ్యాన్ని ఎదుర్కొనే రూహ్‌బాబా పాత్రలో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్నాడు. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించిన ఈ  ఈ సినిమాను భూషణ్ కుమార్ నిర్మించారు. దీపావళికి థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: తనిష్క్ బాగ్చి, సాచెత్-పరంపర, అమల్ మల్లిక్ బృందం; పాటల రచయిత: సమీర్, రష్మీ విరాగ్, ఆదిత్య రిఖారీ, ధవ్ యోగి, సోమ్.