11 August, 2026 | 1:44 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం

11-08-2026 12:28 PM

- మరికల్‌లో రైతు పొలాన్ని పరిశీలించిన కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్

తిమ్మాజీపేట,(విజయక్రాంతి): వ్యవసాయంతో పాటు పశుపోషణను అనుబంధ రంగంగా అభివృద్ధి చేసుకోవడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అన్నారు. మంగళవారం తిమ్మాజీపేట మండలం మరికల్ గ్రామంలో రైతు పెర్కంపల్లి లింగం పొలాన్ని సందర్శించి పెంచుతున్న పశువులను పరిశీలించారు.

రైతు వద్ద ఉన్న పశువుల సంఖ్య, పాల ఉత్పత్తి, పాల విక్రయం ద్వారా వచ్చే ఆదాయం, పశువుల మేత, వైద్య సేవలు, టీకాల పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పశువులకు నాణ్యమైన మేత, పోషకాహారం అందించడంతో పాటు పరిశుభ్రత, వైద్య సేవలు, సకాలంలో టీకాలు వేయడం ద్వారా పాల ఉత్పత్తిని పెంచుకోవచ్చని సూచించారు.

పంటల సాగుతో పాటు పశుపోషణ చేపట్టడం ద్వారా రైతు కుటుంబానికి నిరంతర ఆదాయ వనరు ఏర్పడుతుందని కలెక్టర్ తెలిపారు. పశుపోషక రైతులకు ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించి, అవసరమైన సాంకేతిక సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఆర్వో పాండు, మండల తహసీల్దార్, మరికల్ సర్పంచ్ రమాదేవి, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.